Updated on 02-02-2021
తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు
Lessons in Telugu Poetics- Grammar & Prosody
ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను.
వ్యాకరణ వర్గం పాఠాలు ః-
- సంధి పరిచయం
- సంస్కృత అచ్ సంధులు (సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశ సంధులు)
- అత్వ,ఇత్వ,ఉత్వ సంధులు
- తెలుగు ఆదేశ సంధులు (గసడదవాదేశ, సరళాదేశ, ద్విరుక్త టకార, పుంప్వాదేశ, ప్రాతాది సంధులు)
- తెలుగు ఆగమ సంధులు (యడాగమ,రుగాగమ,నుగాగమ,టుగాగమ సంధులు)
- తెలుగు వర్ణాలు - విభాగం
- తెలుగు పదాలు - విభాగం
- తెలుగు సమాసాలు
- తెలుగు వాక్యం
- ఛందస్సు - పరిచయం
- ఛందస్సు- గణవిభజన (మరో పద్ధతి)
- యతి-ప్రాస-ప్రాస యతి - పరిచయం
- ఉత్పలమాల-చంపకమాల-మత్తేభం-శార్దూలం - వృత్తాలు
- తరళం - స్రగ్ధర - మహాస్రగ్ధర -వృత్తాలు
- సీసం-ఆటవెలది-తేటగీతి
- ద్విపద - తరువోజ
- కంద పద్యం
- రగడలు - భేదాలు - త్రిస్ర గతి రగడలు - చతురస్రగతి రగడలు - ఖండగతి రగడలు
- షడ్విధ ప్రాసములు
- స్వర యతులు
- వ్యంజన యతులు
- ఉభయ యతులు
- షట్ ప్రత్యయాలు
- కవి - కావ్యం - కావ్య ప్రయోజనాలు - కావ్య హేతువులు - కావ్య లక్షణాలు - కావ్యాత్మ వాదాలు
- శబ్ద శక్తులు - ధ్వని ( అభిధ-లక్షణ-వ్యంజన)
- రస సంఖ్య - రస భావాలు - రస సిద్ధాంతం - రసోత్పత్తి వాదం - రసానుమితి వాదం - రసభుక్తి వాదం - రసాఽభివ్యక్తి వాదం
- శబ్దాలంకారాలు
- ఉపమ-ఉత్ప్రేక్ష-రూపకాలంకారాలు
- శ్లేషాలంకారము
- దృష్టాంత - నిదర్శనాలంకారాలు
- అర్థాంతర న్యాస కావ్యలింగాలంకారాలు
అన్నట్టు చెప్పడం మర్చిపోయా..... మీకు అవసరం ఉన్న పాఠాలను సూచించండి. వాటికీ వీలైనంతవరకు పాఠాలు చేసి పెట్టే ప్రయత్నం చేస్తా.
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి. తప్పకుండా మా టపాలను సాంఘిక సంపర్కజాలాల్లో నలుగురితో పంచుకొండి.
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి. తప్పకుండా మా టపాలను సాంఘిక సంపర్కజాలాల్లో నలుగురితో పంచుకొండి.
18 కామెంట్లు:
బాల వ్యాకరణం క్లాసులు ప్రారంభం చేయండి మాష్టారు
తప్పకుండా. మీ సూచనను దృష్టిలో ఉంచుకుంటాను. వీలైనంత త్వరలో ప్రణాళిక రచిస్తాను. ధన్యవాదాలు మీ సూచనకు.
ధన్యవాదాలు మాస్టారు
బాలవ్యాకరణం సంధి, సమాసం, తత్సమ, క్రియా పరిచ్ఛేదాలు వివరించండి
సాహిత్యం విమర్శ సిద్ధాంతాలు
కావ్యప్రయోజనం గురించి దయవుంచి చెప్పండి
మీరు చెప్పే పాఠాలు నాలాంటి వారికీ చాలా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం
తప్పకుండా కావ్యవిమర్శ పై కూడ పాఠాలు చేస్తాను.
దయచేసి, మా పాఠాలను క్రమం తప్పకుండా వీక్షిస్తూ మీ అమూల్యాభిప్రాయాలను రాస్తూ ఉండండి
Namaste sir,naaku c.narayanareddy Nagarjuna saagaram rachana kavvali.
ఈ కింది లింక్ లో దొరుకుతుంది చూడండి
http://www.teluguthesis.com/2016/04/c-narayan-reddy-rachanalu.html
గురువు గారు నమస్తే
మీరుచెప్పే పాఠాలు ఏంతో మంది కి చాలా ఉపయోగం పడుతున్నాయి
ఎగ్జామ్స్ కి DSC కి
ఏ కోచింగ్ సెంటర్ లో కూడ ఇలా చెప్పలేదు
మీకు మేము రుణపడి పోయాం
ఆ భగవంతుడు మిమ్ములను మీకుటంబానికి ఆయురారోగ్య ములు అష్టఐశ్వర్యాలు కలుగజేయాలి 🙏🙏🙏🙏
ధన్యవాదాలు.ఇటువంటి మీ అభిప్రాయాలు మరిన్ని పాఠాలు చేసేందుకు నాకు ఎంతో ప్రోత్సాహం కల్గిస్తాయి.
కోటి విద్యలూ కూటి కొరకే అని సరిపుచ్చు కొని, తెలుగు సాహిత్యాన్ని చదివే అలవాటు మరుగు పడ్డ నాకు మీ పాఠాలు తేట తెలుగు మాధుర్యాన్ని గుర్తు చేసాయి. అందుకు చాలా ధన్య వాదాలు.
ఆ తెలుగు తల్లి కృప మీ కుటుంబం పై సదా వర్షించాలని ప్రార్థిస్తున్నాను. గురుభ్యో నమః
alankaralanu upama utpreksha ane perlu enduku vachayi master
ఉపమించుట అనగా 'పోల్చుట' అని అర్థం. రెండు వేరువేరు వస్తువులకు పోలిక చెప్పుట వలన ఉపమాలంకారము.
అలాగే ఉత్ప్రేక్షించుట అనగా భావించుట. ఉపమేయం ఉపమానంగా భావించడం ఇందులో ఉంటుంది. అందుకే ఉత్ప్రేక్ష.
'రూపం కరోతి ఇతి రూపకం' అనగా రూపమును చేయునది అని అర్థం చెప్పుకోవచ్చు.ఇందులో ఉపమేయాన్ని ఉపమానంగా చెబుతాం. ఉపమేయ రూపం ఉపమాన రూపంగా చేస్తున్నాం కాబట్టి రూపకం.
Sir Dr B R AMBEDKAR OPEN DEGREE M A TELUGU FIRST YEAR (TELUGU SAHITYA CHARITRA BOOK) UNTE PDF SEND CHEYANDI SIR.
నమస్కారం.
చంపక మాల ఉత్పల మాల వంటి వృత్తాలను సంస్కృత వృత్తాలు అని మీరు పరిచయం చేసారు. వీటికి సంస్కృత ఉదాహరణలు ఇవ్వండి గురు గారూ.
సంస్కృతంలో ఎక్కడా చూసినా శ్లోకాలే గాని ఈ వృత్తాలు నాకు కన పడటం లేదు.
గురుభ్యో నమః.
తెలుగు సాహిత్య సమీక్ష
జి.నాగయ్య గారి 2 పుస్తకాలు ఉంటే దయచేసి అప్లోడ్ చేయగలరు.
ఇక్కడ అడిగినందుకు క్షమాపనలు...
ధన్యవాదాలు.
Sir 1990 1st class to 5th class telugu text books pdf vunte pettandi telugu Bharathi text books
Sir jayabheri lesson pettandi
కామెంట్‌ను పోస్ట్ చేయండి