మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp Group: bit.ly/TeluguThesis
6) KOOApp : https://www.kooapp.com/profile/teluguthesis/
లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

Widgets

తెలుగు పాఠాలు - సమయ సద్వినియోగం

తెలుగు పాఠాలు - సమయ సద్వినియోగం

     ఇప్పుడు భారతదేశ మంతా లాక్ డౌన్ తో, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఇంటిలోనే ఉంది కరోనా రాక్షసి భయంతో. దీనివల్ల పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నా, పాఠశాలలు నడువకున్నా తమదగ్గర లభిస్తున్న వనరులతో చదువుకుంటూనే ఉంటారు. అటువంటి వారికోసం coursera వంటి సంస్థలు ఈ ప్రత్యేక సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే విశ్వవిద్యాలయాలనుండి పాఠాలను ఉచితంగా అందిస్తున్నాయి. 
          ఇక, మన దేశంలో E PG Pathashala వంటి సంస్థలు ఐఐటి వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాచార్యుల చేత వివిధ విషయాల్లో పాఠాలు చేయించి ఎల్లవేళలా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. సంస్కృత విద్యార్థులకోసం వ్యోమ సంస్కృత పాఠశాల వంటి సేవా సంస్థలు ప్రజలకు ఉచితంగా సంస్కృత పాఠాలను అందిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా తెలుగు చదువుకోవాలనే విద్యార్థులకు ఉపయోగపడేట్టుగా పాఠాలు చేసి పెట్టాలనే సంకల్పంతో ఈ తెలుగువిద్యాలయం అనే వెబ్ సైట్ ను గతంలోనే ప్రారంభించాను. సంస్కృతసెంట్రల్ అనే యూట్యూబ్ ఛానల్ లో పాఠాలు పెట్టి ఇక్కడ ప్రదర్శిస్తాను. 

          ప్రస్తుతం, ఇండ్లలో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి అనుగుణంగా మార్చ్ 31 రోజు సాయంత్రంనుండి డిగ్రీ విద్యార్థులకు (వీలైతే రోజూ రెండు పూటలా) ఇక్కడ (తెలుగువిద్యాలయంలో) పాఠాలను పెట్టాలనుకుంటున్నాను. విద్యార్థులు ఇండ్లలో చదివి, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని నా ఆశ. 
        
         తెలుగు ప్రాచీన సాహిత్యం విభాగానికి 35/80 మార్కులు ఉంటాయి. అట్లే వ్యాకరణానికి 20/80 మార్కులు ఉంటాయి. కాబట్టి, వాటికి ఇప్పుడు పాఠాలు చెయ్యాలనేది నా లక్ష్యం. అందునా, వ్యాకరణానికి అవసరమైన పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. అవి - 

    వ్యాకరణం ః- ఛందస్సు  2 & 4 సెమెస్టర్ ల వారికోసం .....
 1.  ఛందస్సు పరిచయం 
 2.  గణవిభజన
 3.  యతి-ప్రాస-ప్రాసయతి పరిచయం
 4.  ఉ.మా-చం.మా-శా-మ. వృత్తాలు
 5.  తరళం-స్రగ్ధర-మహా స్రగ్ధరా వృత్తాలు
 6.  సీసం-ఆటవెలది-తేటగీతి
 7.  ద్విపద - తరువో


   అన్నట్టు ఈ ఛందస్సుకు సంబంధించిన పాఠాలు డిగ్రీ విద్యార్థులకే కాదు, ఇంటర్, పది,తొమ్మిది,ఎనిమిది తరగతుల విద్యార్థులకూ, అన్నట్లు ఎమ్మే విద్యార్థులకూనూ ఉపయోగపడుతాయి.  

   ఇక డిగ్రీ రెండవ సెమెష్టర్ విద్యార్థుల పాఠాలు -
 1. గజేంద్రమోక్షం (త్వరలో)
 2. హనుమత్ సందేశము 
 3. సుభాషితాలు  (త్వరలో)
       డిగ్రీ నాలుగవ సెమెష్టర్ విద్యార్థుల పాఠాలు -

 1. నారద గానమాత్సర్యం
 2. వాగ్దానభంగం (త్వరలో)
 3. నారసింహ శతకం (త్వరలో)
 ఈ పాఠాలను వరుసగా అందిస్తాను.    
                         

5 comments:

Unknown said...

Thank you so much sir

Unknown said...

Thank u so much sir ,pG 2year MA lessons cheyyandi .naaku use Avutayi 👏👏👏.

Dr.R.P.Sharma said...

మీ రన్నట్లు అందరికీ చేసే ఉద్దేశ్యమే ఉందండి.

Unknown said...

ధన్యవాదాలు శర్మ గారు.
త్రిశర గణాలు----వివరణ ఇవ్వగలరని విన్నపం.

Unknown said...

పాఠశాల స్థాయిలో ముఖ్యంగా 9,10 తరగతుల పాఠ్యవివరణ నేటి పరిస్థితులకు అత్యవసరం అన్నది నా భావన.పరిశీలించగలరని విజ్ఞప్తి.

Post a comment

Autograph Please