ఇందులో అర్థాలంకారమైన శ్లేషాలంకారాన్ని వివరించాము. మీ మీ అభిప్రాయాలు తెలిపి, ఈ వీడియో పాఠాన్ని మీ మిత్రులతో పంచుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.
ఈ పాఠంలో చందస్సు పరిచయం చేయబడింది. గురు లఘువులను గుర్తించడం, గణ విభజన చేసే పద్ధతి ఇందులో వివరించాము. చివరలో అభ్యాసం కూడా ఇచ్చాము. పాఠంలో విషయాలను చక్కగా ఆకళింపు చేసుకుని, చివర ఇచ్చిన అభ్యాసాన్ని సాధించండి. అటువంటి మరిన్ని సమస్యలను మీ పాఠాలనుండి గ్రహించి సాధించండి.
పవర్ పాయింట్ పెజెంటేషన్ కూడా కింద ఇస్తున్నాము. అవసరాన్ని బట్టి దానినీ వినియోగించుకొండి.
తెలుగువాడిగా పుట్టినందుకు వేమనపద్యం వచ్చి తీరాలి. లేకుంటే తెలుగుదనంలో ఏదో కొంత లోపముందన్నట్లే.
కొన్ని వేమన పద్యాలను శ్రీమతిగూడా భారతి, విశ్రాంత ఉపాధ్యాయురాలు,ఏలూరు గారు వ్యాఖ్యానంతో పాటు విద్యార్థులకు అందిస్తున్నారు. వారికి తెలుగుపరిశోధన ధన్యవాదాలు తెలుపుకుంటుంది.